హైదరాబాద్, ఆగస్టు 10 (నమ స్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ని సీపీఐ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి ధూళిపాల సీతారామచంద్రరావు (1935-2024) శనివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అందజేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి రామచంద్రరావు భౌతికకాయంపై పార్టీ జెండా కప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు, బీవీ విజయలక్ష్మి, సీఆర్ ఫౌం డేషన్ కోశాధికారి చెన్నకేశవరావు, హె ల్త్ డైరెక్టర్ రజిని, భారత మాజీ రాయబారి సురేశ్‌బాబు నివాళులర్పించారు.