మహబూబాబాద్, మార్చి 27: మోదీని గద్దె దించేందుకు సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. అమిత్‌షాకు నేరచరిత్ర ఉన్నదని, కేంద్ర హోంమంత్రి అయ్యాకైనా తన పూర్వ పరిస్థితి ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవుపలికారు.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు అమిత్‌షా చిన్నపిల్లాడని, చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సలహాఇచ్చారు. మహబూబాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులు తాము చెప్పినట్టు వింటున్నాయనుకొనే బీజేపీకి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. రాహుల్‌ను సస్పెండ్ చేసిన రోజును చీకటి రోజుగా అభివర్ణించారు.