హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలతో కక్షపూరితంగా రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ కుమార్తె కాబట్టే ఆమెపై కక్ష సాధింపు చర్యలకు దిగారని, ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణలను లైవ్లో చూపించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల్లో జరిగే విచారణలను లైవ్లో చూపిస్తున్నపుడు.. సీబీఐ ఎందుకు లైవ్లో చూపించదని ప్రశ్నించారు.