CPI Narayana | హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రాజముద్ర జోలికి వెళ్లకుండా.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదని సూచించారు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తే రేవంత్రెడ్డి ఆయన నెత్తిన ఆయనే చెత్త వేసుకున్నట్టు అవుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్లో శుక్రవారం నారాయణ మాట్లాడుతూ.. జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర గీతం కంపోజ్ చేయానికి కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్గా పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవని, హద్దులు గీయడం సరికాదని చెప్పారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి కూడా వైఎస్ జగన్ను ఫాలో అవుతున్నారని పేర్కొన్నారు.