హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): సమాజంలోని ప్రతి మనిషి బాగుండాలనేది కమ్యూనిజం సిద్ధాంతమని, కార్మికవర్గమే కమ్యూనిజానికి మూలస్తంభమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ‘ప్రతిఘటన’ పేరిట మగ్దూంభవన్‌లో సభ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.