దమ్మపేట, జూన్ 1: స్థానిక సమస్యల పరిష్కారం కోసం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇంటిని సీపీఐ నేతలు ఆదివారం ముట్టడించారు. డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం ఎమ్మెల్యే స్వగ్రామమైన గండుగులపల్లిలోని జారే ఇంటిని సీపీఐ నాయకులు, నిరుపేదలు ముట్టడించి ధర్నా చేశారు.
కాగా, ఎమ్మెల్యే జారే.. ఆందోళనకారులను లోపలికి పిలిపించుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో అధికారులను విచారణకు పంపి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.