నాగర్‌కర్నూల్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు దాదాపు మూడు దశాబ్దాల కాలం కమ్యూనిస్టు పెద్దన్నగా ఉన్న కామ్రేడ్ మాడ్గుల లింగా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు.
లింగారెడ్డి మృతి పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.
కాగా, లింగారెడ్డి తెలకపల్లి మండలంలోని తన స్వగ్రామం గౌరెడ్డిపల్లి ( గట్టు రావిపాకుల, గట్టు నెల్లికుదురు) ఉమ్మడి గ్రామానికి 30 ఏండ్లు సర్పంచ్‌గా సేవలందించారు.
ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సీపీఐ క్రమశిక్షణ సంఘంచైర్మన్ గా పని చేశారు. లింగారెడ్డి అంత్యక్రియలు రేపు వారి స్వగ్రామంలో నిర్వహించనున్నారు.