Telangana | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సమస్యలను తెలుసుకునేందుకు మంత్రులు, ప్రభుత్వాధికారులు మరింతగా ప్రజలతో మమేకమవ్వాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా స్పందించని స్థితిలో మంత్రు లు ఉన్నారని, అధికారులు కూడా అదేరీతిన ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ నేతలు చాడ వెంకట్రెడ్డి, పశ్య పద్మ, బాలనర్సింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్టు ఎన్కౌంటర్లు తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా? తెలియక జరుగుతున్నాయనా? అని ప్రశ్నించా రు.
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో జరిగి న ఎన్కౌంటర్లో తెలంగాణ పోలీసులు ఎం దుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లలో మరణాలన్నీ ప్రభు త్వ హత్యలేనని విమర్శించారు. సీపీఐకి ఎమ్మె ల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల పట్ల 144 సెక్షన్ విధింపు, హౌస్ అరెస్టులు ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు. సీఎం హామీ ఇచ్చిన మేరకు ఆర్టీసీ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హకును కల్పించాలని కోరా రు. రైతుభరోసా అమలుపై రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కౌలు రైతులకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని పశ్య పద్మ కోరారు.