హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికలకు ఎలక్షన్ అధికారిగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేశ్ భగవత్ వ్యవహరించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా డీజీపీ జితేందర్ ఉండనున్నారు.
సెక్రటరీగా హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, జాయింట్ సెక్రటరీగా డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, కోశాధికారిగా హైదరాబాద్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, సభ్యులుగా ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీ భాసరన్, మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి ధరావత్, నిర్మల్ ఎస్పీ జానకిశర్మిల, హైదరాబాద్ డీసీపీ స్నేహమెహ్రా ఎన్నికయ్యారు. నూతన కమిటీకి సహచర ఐపీఎస్‌లు శుభాకాంక్షలు తెలిపారు. వీరు శాంతిభద్రతలతోపాటు ఐపీఎస్‌ల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.