భద్రాద్రి కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాలలో పులి సంచరిస్తోంది. ఆవును ఓ పెద్దపులి చంపేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు.