Wanaparthy | ఆత్మకూరు, సెప్టెంబర్ 11 : వరాహానికి గోమాత పాలిచ్చిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకున్నది. బుధవారం స్థానిక శ్రీ సాయివాణి కల్యాణమండపం ప్రాంగణంలో ఓ ఆవు కూర్చొని ఉండగా.. పంది వెళ్లి పాలు తాగింది. సామాన్యంగా ఆవులు పాలు ఇతర జంతువులకు ఇవ్వవు.. కానీ మాతృత్వానికే మరోపేరుగా చెప్పుకునే గోమాత అయినందుకేనేమో ఆకలితో వచ్చిన వరాహానికి మాతృమూర్తిగా పాలు అందించింది. స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా నెటిజన్లు ఆవు మాతృత్వాన్ని ప్రశంశిస్తున్నారు.