మహబూబ్నగర్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ( P.C. Ghosh Commission) నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ( Court Verdict ) పట్ల మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ( C. Laxma Reddy) హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశించడంతో న్యాయం గెలిచిందన్నారు.కోర్టు తీర్పుతో నైనా కాంగ్రెస్, బీజేపీలకు కనువిప్పు కలగాలని అన్నారు.
తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్,బీజేపీలు అడ్డగోలుగా విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. కేసీఆర్( KCR ) ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కానీ న్యాయ స్థానాలపై నమ్మకంతో కేసీఆర్ ,హరీష్ రావు పోరాడగా చివరకు నిజం గెలిచిందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్యలు, వేధింపులు మానుకోవాలని హితవు పలికారు. పాలనపై దృష్టి సారించాలని సూచించారు.