నాంపల్లి కోర్టులు, జూన్ 8 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. 90 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పూర్తయిన తర్వాతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య బుధవారం సూచించారు. రెండో నిందితుడు రాజశేఖర్‌రెడ్డి పిటిషన్‌కు సిట్ కౌంటర్ దాఖలు చేసింది. సోమవారం కోర్టుకు చార్జిషీట్ సమర్పించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ కేసులో నిందితురాలు రాయపురం దివ్యను మహిళా జైలు అధికారులు గురువారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ నెల 22 వరకు ఆమెకు కోర్టు రిమాండ్ పొడిగించింది. కొంతం మురళీధర్‌రెడ్డి, ఆకుల మనోజ్‌కుమార్, అట్ల సుచరితారెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన్ రాహుల్‌కుమార్, లోకినేని సతీశ్‌కుమార్ పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయాలని పీపీని కోర్టు
ఆదేశించింది.