టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, ఎమ్మెల్సీ దయాకర్‌పై కేసులు
బీఆర్ఎస్ శాసనసభా పక్షనేత హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎన్ఎస్లోని సెక్షన్ 356 కింద వారిద్దరిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
- 29న విచారణకు హాజరు కావాలని కోర్టు సమన్లు
- హరీశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శాసనసభా పక్షనేత హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎన్ఎస్లోని సెక్షన్ 356 కింద వారిద్దరిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ నెల 29న ఇద్దరు నిందితులు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా మహేశ్‌గౌడ్, దయాకర్ నిరాధార ఆరోపణలు చేశారని హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు జారీచేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో హరీశ్‌రావు పరువునష్టం దావా వేశారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

