హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): వినియోగదారుడికి రూ. 35వేలు చెల్లించాలంటూ అమెజాన్, బోట్ కంపెనీలను కోర్టు ఆదేశించింది. గజ్జెల శ్రీనివాస్ గత సంవత్సరం జనవరి 18న బోట్ కంపెనీకి చెందిన సౌండ్ బార్‌ను అమెజాన్‌లో రూ.19,999కి కొన్నాడు. అది సరిగా పనిచేయకపోవడంతో రెండు కంపెనీల కస్టమర్ కేర్లను ఆశ్రయించాడు.
అ యినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ జరిపిన కోర్టు ప్రొడక్ట్ ఖరీదు, పరిహారం, కోర్టు ఖర్చులు కలుపుకొని రూ. 35వేలను శ్రీనివాస్‌కు చెల్లించాలని కంపెనీలను ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.