వెంకటాపూర్, డిసెంబర్ 24: గంట వ్యవధిలోనే భార్యాభర్తలు ప్రాణాలు విడిచారు. ఒకరు ఫిట్స్‌తో మరొకరు గుండెపోటుతో మరణించారు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసపత్రి రాజయ్య (75), స్వరూప (70) దంపతులు. రాజయ్య సింగరేణి కార్మికుడిగా పనిచేసి రిటైర్ అయ్యా రు. అనంతరం మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్లో ఇల్లు కట్టుకొని భార్యతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం భార్య స్వరూపకు ఫిట్స్ వచ్చి కిందపడిపోగా, కొద్దిసేపటికే మృతి చెందింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త రాజయ్యకు గంట వ్యవధిలోనే గుండెపోటు వచ్చింది. బంధువులు ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెం దినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వీరికి ము గ్గురు కుమారులు ఉండగా, వారు వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు.