వికారాబాద్: జిల్లాలోని పరిగి (Parigi) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తొండపల్లి శివారులో బైకును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
మృతులను కావలి సుభాని, గుర్రంపల్లి కృష్ణయ్యగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.