అమీన్పూర్, జనవరి 5: కుటుంబ కలహాలతో దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నరేశ్ వివరాల ప్రకారం .. ఏపీలోని కర్నూల్ జిల్లా మద్దికేర మండలం పెరవళ్లికి చెందిన లాల్ శేఖర్ (32) భార్య అనూష (25), కుటుంబసభ్యులతో కలిసి రెండేండ్ల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలోని ఇలాపూర్ చిన్నతండాకు వచ్చి ధోబీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవజరుగగా.. అనూష తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నది. లాల్ శేఖర్ అక్కడికి వెళ్లి చూసిన అనంతరం భయాందోళనకుగురై తన సొంత ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. మృతురాలి సోదరి తులసి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.