తొర్రూరు, జూలై 11 : మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మా టేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్‌తో పొలం దున్ని ఇంటికి వస్తుండగా బీఆర్ఎస్ పాటలు పెట్టుకున్నాడు.
గ్రామంలోకి రాగానే ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పాటలు ఆపాలని హెచ్చరించగా, నిరాకరించాడు. దీంతో యూకన్నతో పా టు ఆయన భార్యపై వారు దాడిచేశారు.