గజ్వేల్/తొగుట, ఏప్రిల్ 13: దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరముందని, తెలంగాణలో జరిగిన అభివృద్ధ్ది, అమలవుతున్న సంక్షే మ పథకాలను దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని మహారాష్ట్ర ప్రతినిధుల బృందం ఆకాంక్షించింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు కుల్దీప్, పవన్ కర్వన్, నాన బాచావ్, వైభవ్ దేశ్‌ముఖ్, లక్ష్మణ్ సాబ్, బిలాల్సాబ్, సోమ్నాథ్లతో కూడిన బృందం గురువారం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది.
కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు, ములుగు రైతు వేదిక, వర్గల్ మండలం సింగాయిపల్లి అటవీ ప్రాంతం, గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్, గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ సంపులు, గజ్వేల్‌లోని వైకుంఠ ధామాలను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి మహారాష్ట్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా బృం దం సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతటా జరగాలని ఆకాంక్షించారు.