హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, దీనిపై పిటిషనర్‌కు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని క్రోడీకరిస్తూ రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ను మార్చి 5కు వాయిదా వేస్తూ తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుకయారా ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల కు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ 2023, మార్చిలో ప్రజాప్రయోజన వ్యా జ్యం దాఖలైంది. వేర్వేరు జిల్లాల్లోని 220 సర్పంచ్ పదవులకు, 94 ఎంపీటీసీ, నాలు గు జడ్పీటీసీ, 5,364 గ్రామ వార్డులు, 344 ఉపసర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని పిల్లో పేరొన్నారు. వీటికి ఎన్నిక లు నిర్వహించకపోవడంతో ఆయా పంచాయతీలు, వార్డు లు ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చే నిధులను కోల్పోతున్నాయని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీస్ అధికారుల అసోసియేషన్‌కు ఐదు వారాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఇదే హైకోర్టు 2016లో జారీచేసిన ఉత్తర్వులను అమలు చే యాలని 2023 మే 10న పిటిషనర్ జనార్దన్ వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.