Transfers | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీలో ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం బుధవారం మొదలైన కౌన్సెలింగ్ గురువారం ఉదయం 11:30 గంటల వరకు కొనసాగింది. గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లు, డిగ్రీ కాలేజీ స్టాఫ్ మినహాయించి మిగతా అన్ని కేడర్లలో అవసరానికి మించి 317 జీవోఫలితంగా డిస్ లొకేటైన ఉద్యోగ, ఉపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. వేకెన్సీ లిస్టులో తప్పులున్నాయని, అరైజింగ్ వెకెన్సీలు చూపడం లేదని, స్పౌజ్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదని అభ్యంతరాలు వ్యక్తమవడంతో కౌన్సెలింగ్‌లో జాప్యం జరిగింది.
రాత్రి 10:30 గంటలకు తిరిగి ప్రారంభమై గురువారం ఉదయం 11:30 వరకు కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం గురువారం జేఎల్, పీజీటీ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆ ప్రక్రియ ప్రారంభించకుండానే కౌన్సెలింగ్‌తో అలిసిపోయామని పేర్కొంటూ శుక్రవారానికి వాయిదా వేశారు. సమాచారం తెలియని ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు.
గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఆ శాఖ గురువారం జీవో-17తోపాటు షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,700 మంది ఉపాధ్యాయులకు ఇది వర్తించనున్నది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి బదిలీ ప్రక్రియను ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు.