Gutha Sukhender Reddy | చిట్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1969-70 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన మిత్రులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి విద్యార్థి జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
మండలి చైర్మన్ హోదాలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. తన స్నేహితులతో కలిసిపోయి, అందర్నీ ఆప్యాయంగా పలుకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. తమకు చదువు చెప్పిన ఐదుగురు ఉపాధ్యాయులను ఆహ్వానించగా, ముగ్గురు హాజరయ్యారు. ఆ ముగ్గురు ఉపాధ్యాయులను వారు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. మొత్తం 44 మందికి గానూ ఇప్పటికే 9 మంది చనిపోయారు. మిగిలిన 35 మంది గెట్ టు గెదర్‌కు హాజరయ్యారు.