ఖమ్మం వ్యవసాయం/జమ్మికుంట రూరల్, మార్చి 29: తెలంగాణలోని ప్రధా న మార్కెట్లలో పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర అత్యధికంగా రూ.12,100 పలికింది. బిడ్డింగ్ ప్రారంభం కాగానే ఖరీదుదారులు పోటీపడటంతో రికార్డుస్థాయి ధర పలికింది. కాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొత్త వ్యవసాయ మార్కెట్లో గరిష్ఠ ధర రూ.12,050 పలుకడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.