పెద్దపల్లి జంక్షన్, ఫిబ్రవరి 14: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు స్థాయి ధర లభించింది. ఈ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా క్వింటాల్‌కు రూ.10,100 ధర పలికింది. దీంతో మార్కెట్ యార్డులో రైతులు స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.