ఖమ్మం వ్యవసాయం, మే 14: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. శనివారం ఉదయం 1,300 బస్తాల పత్తి యార్డుకు వచ్చింది. సీక్రెట్ బిడ్డింగ్‌లో ఖరీదుదారులు పోటీపడటంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిక ధర పలికింది. గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ.13,050 ధర నమోదైంది. పంట తగ్గిపోవడం, ఈ నెల16 నుంచి మార్కెట్‌కు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి పత్తిని కొనుగోలు చేస్తున్నారు.