పలిమెల, సెప్టెంబర్ 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో కురిసిన వర్షాలతో రైతులు వందల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో మండలంలోని లెంకలగడ్డ, పంకెన గ్రామాలకు గోదావరి వరద కమ్ము(ఉధృతి)తో వందల ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు ముంపునకు గురయ్యాయి.
పంట వేసినప్పటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు నీట మునగడంతో పత్తి మొక చిగుర్లు ఎండిపోయి పూత, కాయ నేలరాలాయి. ఇప్పటివరకు ఎకరాకు రూ.70వేల వరకు ఖర్చయ్యిందని, చేతికొచ్చిన పంట నీట మునగడంతో నోటికాడికి వచ్చిన పంట నేలపాలైందని వాపోతున్నారు.