హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మత్స్యశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. ఆ శాఖలో వివిధ పథకాల కింద పనులు చేసిన లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నా రు. ఏ బిల్లు మంజూరు చేయాలన్నా, చేతులు తడపనిదే ఫైల్ కదిలించడం లేదని లబ్ధిదారు లు ఆరోపిస్తున్నారు.
కిందిస్థాయిలోని క్లర్కు లు మొదలుకొని రాష్ట్ర కార్యాలయ సిబ్బంది, అధికారుల వరకు అడుగడుగునా లంచాలు అడుగుతున్నారని చెప్తున్నారు. తీరా బిల్లులు మంజూరై ట్రెజరీకి వెళ్లాక వాటిని పాస్ చేయించుకునేందుకు అక్కడ కూడా లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు.