ఘట్కేసర్ రూరల్, నవంబర్ 26: విద్యుత్ వైర్లను పాత పోల్ నుంచి కొత్త పోల్‌కు మార్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఘట్కేసర్ ఏఈ, లైన్ ఇన్స్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఘట్కేసర్లో జరిగింది. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండల విద్యుత్ కార్యాలయంలో ఏఈ(ఆపరేషన్)గా బలరాం నాయక్, లైన్ ఇన్స్పెక్టర్గా హేమంత్ నాయక్ పని చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన ఇంటి సమీపంలోని 11 కేవీ వైర్‌ను పాత పోల్ నుంచి కొత్త పోల్ కు మార్చడంతో పాటు సైడ్ ఆర్మ్‌ను మరో పోల్‌కు ఇన్స్టాల్ చేయడానికి ఆశ్రయించా డు. అధికారికంగా ఆమోదించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఏఈ బలరాం నాయక్ రూ.10 వేలు డిమాండ్ చేయగా, లైన్ ఇన్స్పెక్టర్ బీ హేమంత్ నా యక్ రూ.5వేలను యంనంపేట్‌కు చెంది న మధ్యవర్తి బీ మహేశ్ ద్వారా డిమాండ్ చేశారు. రూ.15వేలను మంగళవారం అందజేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పిర్జాదిగూడ కార్పొరేషన్ పర్వతాపూర్‌లో ఏఈ ఇంటి వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.