నల్లబెల్లి, ఏప్రిల్ 13 : చేతికొచ్చిన మక్కజొన్న పంట రైతుల కండ్ల ఎదుటే ఆహుతైన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం జరిగింది. మూడుచెక్కలపల్లెలో గుగులోత్ సోమ్లా, పున్నం నాగలక్ష్మి, పున్నం చంద్రు, ఇస్లావత్ ధర్మ, ఇస్లావత్ విజేందర్, ఇస్లావత్ రవినాయక్, లాలూనాయక్, ధరావత్ ఆలు, భూక్యా మహేందర్ 20 ఎకరాల్లో మక్కజొన్న సాగుచేశారు.
ఈ వ్యవసాయ భూముల్లో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కరెంటు స్తంభానికి మధ్య వైర్లు లూజుగా ఉండటంతో గాలి వీచి ఒకదానికి ఒకటి తగిలి నిప్పులు చెలరేగి మక్కజొన్న పంటలతోపాటు ఆరబెట్టిన కంకులకు అంటుకున్నాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మొత్తం పంట కాలిబూడిదై రూ.20 లక్షల వరకు నష్టం జరిగినట్టు బాధిత రైతులు తెలిపారు.