పెనుబల్లి, సెప్టెంబర్ 14: ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను వంట మాస్టర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు వివరాల ప్రకారం.. రెండ్రోజుల క్రితం హాస్టల్ పరిధిలోని క్రీడా ప్రాంగణంలో విద్యార్థులు కబడ్డీ ఆడుతుండటంతో వంట మాస్టర్ రమేశ్ వారిని మందలించాడు.
మట్టి, బురద అంటుతుందని విద్యార్థులను కొట్టాడు. ఇందులో ఓ విద్యార్థి చంప, వీపు కందిపోయింది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఆదివారం హాస్టల్కు వచ్చి వార్డెన్ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.