హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ పాలనలో గ్లోబల్ సిటీగా ఎదిగిన హైదరాబాద్‌ను ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి గాలికొదిలేశారని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రా పేరిట దోపిడీ చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ మంత్రిగా కూడా ఉన్న ఆయన మహానగరంపై సమీక్ష కూడా నిర్వహించలేదని తెలిపారు. సంచులు నింపుకోవాడానికే మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో సీఎం హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, భవనాలకు రిబ్బన్లు కట్ చేస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని, పారిశుధ్య నిర్వహణ సరిగాలేదని, ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు.