జడ్చర్ల టౌన్, జూలై 18 : మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సహకారంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్ ఆధ్వర్యంలో శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసుర్లాబాద్లోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో వైద్య శిబిరం కోసం ఏర్పాట్లు చేశారు.
ఎస్వీఎస్ దవాఖాన వైద్యులు గ్రామానికి చేరుకోగా ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించొద్దని సర్పంచ్ భర్త బాలస్వామితోపాటు కాంగ్రెస్ మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇక్కడే వైద్య శిబిరం నిర్వహిస్తామని ప్రణీల్చందర్తోపాటు బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. జడ్చర్ల పోలీసులు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడగా.. వైద్య బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది.