నార్నూర్, సెప్టెంబర్ 1: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొలాంగూడకు చెందిన సేదం లక్ష్మణ్(35) ఆదివారం మధ్యాహ్నం పక్కనే ఉంటున్న కొడప జైతు ఇంట్లో టీవీ చూడడానికి వెళ్లాడు. అప్పటికే జైతు, రాములు టీవీ చూస్తున్నారు. లక్ష్మణ్ టీవీ చానల్ మార్చాలని రాముతో గొడవపడ్డాడు. తాగిన మత్తులో ఉన్న మాడావి రాము చంపేస్తానని లక్ష్మణ్ ఛాతిపై పిడికిలితో బలంగా కొట్టి, గొంతు నొక్కాడు. లక్ష్మణ్ స్పృహ కోల్పోయాడు. గమనించిన రాము అక్కడి నుంచి పారిపోయాడు. లక్ష్మణ్‌ను దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. లక్ష్మణ్ భార్య మంతుబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రహీం పాషా తెలిపారు.