భువనగిరి కలెక్టరేట్, జూన్ 17: త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకొనే బక్రీద్ పండుగ వేళ.. భవనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో సోమవారం వివాదాస్పద పోస్టర్ వైరల్ అయ్యింది. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఓ పోస్టర్‌ను క్రియేట్ చేశారు. అందులో మేకకు బదులుగా ఆవు ఫొటో ఉండటంతో హిందువులు, హిందుత్వ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఆ పోస్టర్ హిందువులను కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే కుంభం వివరణ ఇస్తూ.. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. తన సోషల్ మీడియా టీమ్ పొరపాటున మేక ఫొటోకు బదులు ఆవు ఫొటో పెట్టిందని తెలిపారు. ఇది తనకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని, ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడినైట్టెతే క్షమించాలని కోరారు. తానూ హిందువునేనని, ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టర్‌ను వెంటనే తొలగించామని వివరించారు.