ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 00:53:07

నియంత్రిత సాగు సాధ్యమే

నియంత్రిత సాగు సాధ్యమే

  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌/చిగురుమామిడి/సైదాపూర్‌: ప్రణాళికతో ముందుకు సాగితే నియంత్రిత సాగు సాధ్యమవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూర్‌బాద్‌లోని మంత్రి కార్యాలయంలో నియంత్రిత సాగుపై వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఏసీపీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి హుజూరాబాద్‌ మండలం ఇప్పల నర్సింగాపూర్‌లోని జీలుగ సాగు ను పరిశీలించారు. మంత్రి ట్రాక్టర్‌తో జీలుగ దున్ని వరిసాగు పనులు ప్రారంభించారు. తర్వాత సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లి, చిగురుమామిడి మండలం రేకొండలో శ్రీరాజరాజేశ్వర జలాశయం కుడి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. రేకొండలో భూనిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు.logo