అచ్చంపేట, డిసెంబర్ 24 : ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు సహకరిస్తే రైతులకు తగిన పరిహారమిస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని క్యాంప్ కార్యాలయంలో అనంతవరం రైతులు, నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. తులకు పరిహారమిచ్చి ఆదుకుంటామని భరోసానిచ్చారు. అనంతరం అచ్చంపేట మం డలం మార్లపాడులో నక్కలగండి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సభలో కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకులంగా స్పందిస్తేనే పరిహారం, పునరావాసానికి ఒప్పుకుంటామని నిర్వాసితులు తేల్చి చెప్పారు.