సూర్యపేట : తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన 2023 డైరీ, క్యాలెండర్ ను సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల విద్యుత్ కాంట్రాక్టర్లతో పాటు యావత్ రైతాంగానికి ఎంతో లాభం చేకూరిందన్నారు.
సుదూర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలు సరఫరా చేసే భారం తప్పిందని గుర్తు చేశారు. యావత్ భారత దేశంలో వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా యే అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధితో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ కే మాజిద్ , తెలంగాణా విద్యుత్ లైసెన్సింగ్ బోర్డ్ డైరెక్టర్ పర్వతాలు, అసోసియేషన్ సూర్యాపేట ప్రెసిడెంట్ వేణుగోపాల్, హుజుర్నగగర్ ప్రెసిడెంట్ జానకి రామిరెడ్డి, నల్గొండ ప్రెసిడెంట్ యాదగిరి,సత్తిరెడ్డి,వహిద్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.