Telangana | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు. రివైజ్డ్ ఎస్టిమేషన్లను ఆమోదించడం లేదు. ఇలాగయితే ప్రాజెక్టు పనులను ఇక చేయలేం అంటూ ఇరిగేషన్‌శాఖలోని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. పదుల సంఖ్యలో కాంట్రాక్టర్లు ఇదే విషయాన్ని తేల్చిచెప్పేస్తున్నారు. ఇప్పటికే పలు ఏజెన్సీలు ప్రీక్లోజర్ కోసం ఇరిగేషన్‌శాఖకు దరఖాస్తు పెట్టుకున్నాయి. సాధారణంగా ఏదయిన పనికి సంబంధించి ఏజెన్సీతో ఇరిగేషన్‌శాఖ అగ్రిమెంట్ చేసుకుంటుంది.
పనులను చేసిన కొద్దీ ఎంబీ రికార్డులు చేసి ఆ మేరకు బిల్లులను చెల్లిస్తుంది. ఒప్పందం గడువు ముగిసినా పనులు ఇంకా మిగిలి ఉన్నట్లయితే అగ్రిమెంట్‌ను ఎక్స్టెన్షన్ చేస్తూ పోతుంటుంది. 10నెలలుగా ఇరిగేషన్‌శాఖలోని బడాబడా ఏజెన్సీలకు మినహా చిన్నా చితక ఏజెన్సీలకు 10నెలలుగా రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక, మిగిలిపోయిన పనులను చేయలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. మిగిలిన పోయిన పనులను చేయలేమంటూ, ప్రీక్లోజర్‌కు అనుమతివ్వాలంటూ ఇరిగేషన్‌శాఖకు మొరపెట్టుకుంటున్నారు.
ఇప్పటికే జవహార్నెట్టెంపాడు, ఎమ్మార్పీతోపాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యమైన పలు పనులను సొంతంగా, ఇతర ఏజెన్సీలతో కలిసి జాయింట్ వెంచర్‌గా చేస్తున్న సంస్థలు సైతం ప్రీక్లోజర్‌కు మొగ్గుచూపడం గమనార్హం. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలు తడిసిమోపెడవుతున్నాయని ఏజెన్సీలు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పరిధిలోని ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను చేయలేమంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించాలని, అప్పుడే తమ పరిధఙలో మిగిలిన పనులను పూర్తిచేస్తామంటూ పలు ఏజెన్సీలు ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల సీఈలకు తేల్చిచెప్పారు. ప్రీక్లోజర్‌కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
బిల్లుల సంగతేమోకానీ బ్యాంకు గ్యారంటీలనైనా విడుదల చేయాలని పలు ఏజెన్సీలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయంటే బిల్లుల చెల్లింపు ఏ తీ రుగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా ప్రాజెక్టు పనులకు సంబంధించి టెండర్ ప్రక్రి య, ఒప్పందం క్రమంలో ఇరిగేషన్‌శాఖ సదరు ఏజెన్సీల నుంచి ఈఎండీ (ఎర్నెస్ట్ మ్యాన్ డిపాజిట్), ఎఫ్ఎస్డీ (ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్)లను సేకరిస్తున్నది. మొత్తం ప్రాజెక్టు విలువలో ఇది దాదాపు 5శాతం మేరకు ఉంటుం ది. ఒప్పందం మేరకు పనులన్నీ పూర్తయ్యాయని నిర్ధారించుకున్నాక తరువాత ఈఎండీ, ఎఫ్‌ఎస్‌డీలను విడుదల చేస్తా యి. ఏజెన్సీలు ఒప్పందం మేరకు పనులను పూర్తిచేయనట్లయితే ఈ డిపాజిట్ల నుంచి ఆ మేరకు సొమ్మును ఇరిగేషన్శా ఖ మినహాయించుకుంటుంది. ఇదిలా ఉంటే ఇరిగేషన్‌శాఖలోని అనేక ఏజెన్సీలు ఇప్పు డు బిల్లుల సంగతి అటుంచితే ప్రస్తు తం ఈ డిపాజిట్లు, బ్యాంకు గ్యారంటీలనైనా విడుదల చేయాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. పనులను చేయలేమని తేల్చిచెబుతున్నాయి. ఇప్పటికే తీ వ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే బిల్లులను చెల్లించని పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే ప్రీక్లోజర్, బ్యాంకు గ్యారంటీల తిరి గి చెల్లింపు కోసం కాంట్రాక్టర్లు పెట్టుకుంటున్న విజ్ఞప్తులన్నీంటినీ ఇరిగేషన్‌శాఖ అ ధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించారు. ఏజెన్సీలతో చర్చలు కొనసాగిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రత్యేక స మావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.