అశ్వాపురం, మార్చి 25 : బిల్లులు చెల్లించడంలేదంటూ ఎంపీడీవో ఎదుట ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో బుధవారం చోటుచేసుకున్నది. బాధితుడి కథ నం ప్రకారం.. అశ్వాపురం మండలం మల్లెలమడుగుకు చెందిన జాలే శ్రీనివాస్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ మండలంలోని 3 పంచాయతీల్లో గడిచిన మూడేండ్లుగా పైపులైన్లు, వాటర్ ట్యాంకుల మెట్లు, మోటర్ల మరమ్మతులు, పెయింటింగ్ సహా ఇతర సివిల్ పనులు చేశాడు. అందుకు సంబంధించి రూ. 8లక్షల బిల్లులు రావాల్సి ఉన్నది. ప్రభు త్వం ఇటీవల ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేసింది. ఆ నిధు ల్లో సగ భాగాన్ని పాత బిల్లులకు చెల్లించాలని, మిగతా సగ భాగాన్ని పరిపాలనా అవసరాలకు వినియోగించాలని సూచించారు.
దీంతో సదరు కాంట్రాక్టర్ ఆయా పంచాయతీల కార్యదర్శులను కలిసి బిల్లుల చెల్లిం పు గురించి అడిగినా,వారు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. విసిగిపోయిన అతడు.. తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అశ్వాపురం మం డల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నా డు. పురుగులమందు డబ్బాను వెంట తీసుకెళ్లాడు. బిల్లులు చెల్లించాలని కోరుతూ అతడి కుటుంబ సభ్యులంతా కలిసి కార్యాలయ గుమ్మానికి అడ్డుగా పడుకొని నిరసన తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి కొద్దిసేపటికి లేచి పురుగులమందు తాగే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీనిపై ఎంపీడీవో ముత్యాలరావు స్పంది స్తూ.. జాలే శ్రీనివాసరెడ్డి చేసిన పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను పరిశీలించి, అవకాశం మేరకు చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు.