మెండోరా, ఆగస్టు 20 : ఎగువ నుంచి వరద ఉద్ధృతి ఉండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. గురువారం అర్ధరాత్రి నుంచి 61,650 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఏడు గేట్లు ఎత్తి 21,840 క్యూసెక్కులు దిగువకు వదులుతూ వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నానికి ఇన్ఫ్లో 30,300 క్యూసెక్కులకు తగ్గిపోయింది. సాయంత్రానికి ఇన్ఫ్లో 9,680 క్యూసెక్కులకు తగ్గిపోవడంతో నాలుగు గేట్లను మూసివేసి మూడింటి ద్వారా 9,036 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు.