నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 60,948 క్యూసెక్కుల నీరు వస్తుండగా 67,865 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను 311.1486 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.