హైదరాబాద్, నవంబర్12(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఎన్ఫోర్స్మెంట్ కోసం జిల్లాస్థాయిలో 33 బృందాలు, రాష్ట్రస్థాయిలో మూడు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఒకో బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఇతర సిబ్బంది ఉంటారని తెలిపా రు. గతనెలల్లో రద్దు చేసిన చెస్పోస్ట్లలో పని చేసిన సిబ్బందిని కూడా ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. వారంరోజుల వ్యవధిలో 2576 వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. జేటీసీ-హైదరాబాద్, డీటీసీలు ప్రభుత్వ సెలవుదినాలతో కనీసం ఒక ఎన్ఫోర్స్మెంట్ బృందం రోడ్లపై ఉండేలా చూడాలని సూచించారు.