చిక్కడపల్లి, ఏప్రిల్ 23: సీఎం కేసీఆర్ కృషితోనే వెనకబడిన వర్గాలకు ఆత్మ గౌరవ భవనాలు సాధ్యమయ్యాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో కోట్ల విలువ చేసే ఎకరం స్థలంలో వడ్డెర ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించబోతున్నారని చెప్పారు. ఆదివారం మంత్రి గంగుల కమలాకర్ వడ్డెర సంఘం ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్స్ పత్రాలను వడ్డెర ట్రస్ట్ చైర్మన్ జరుపటి సత్యనారాయణ రాజు, ఎత్తరి అంతయ్య తదితరులకు అందజేశారు. విలువైన స్థలం కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి గంగులకు ట్రస్ట్ చైర్మన్ సత్యనారాయణరాజు, ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.