హైదరాబాద్, సెప్టెంబర్21 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇచ్చిన డిజైన్ల మేరకే చేపట్టామని, ఎక్కడా డివియేషన్ లేదని ఇంజినీర్లు, క్వాలి టీ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జస్టిస్ ఘోష్ ఎదుట నివేదించారు. బీఆర్కే భవన్లో శనివారం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగింది.
అంచనాకు మించి బరాజ్ వద్ద నీటి ప్రవాహ వేగముందని, గుర్తించిన వెంటనే పరిష్కారాల కోసం నిపుణులను సంప్రదించామని, పరీక్షలను నిర్వహించామన్నారు. నిర్మాణ ఏజె న్సీ సైట్ వద్దనే క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని చెప్పా రు. నాణ్యతా పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.