రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) బహిరంగ లేఖ రాసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేయాలని స్టేట్ చైర్మన్ యు.సురేందర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్ రెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.
గత ఐదేళ్లుగా అంటే 202 నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగగ్లో ఉన్నాయని లేఖలో తెలిపారు. ప్రభుత్వం మారి 27 నెలలు గడిచినప్పటికీ.. బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కాంట్రాక్టర్లు నేడు అప్పుల పాలై.. జీవితంతో పోరాడే పరిస్థితికి చేరుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణం ఒక కాంట్రాక్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రకటించే రాష్ట్రంలో, ప్రభుత్వ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బకాయిల కోసం ఎదురుచూడటం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఆర్అండ్బీ, పీఆర్ శాఖల్లో పాత, కొత్త బిల్లులు చెల్లించారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మీ నాయకత్వంలో ఈ సమస్యకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి తోడ్పడే కాంట్రాక్టర్లను నిర్లక్ష్యం చేయడం అనుకూలం కాదని సూచించారు.
* అన్ని జిల్లాల్లో పెండింగ్లో ఉన్న చెల్లింపులను తక్షణమే చెల్లించాలి.
* బడ్జెట్ పరిమితులు ఉంటే కొనసాగుతున్న పనులను నిలిపివేసి, కాంట్రాక్టర్ల డిపాజిట్లను వెంటనే విడుదల చేయాలి. అని కోరారు. ఈ సమస్యలను తక్షణపై పరిష్కరించి కాంట్రాక్టర్లలో నమ్మకాన్ని పునరుద్ధరించాలని అన్నారు.