రాజ్యాంగ సంస్థలు కారాదు తోలుబొమ్మలు
రాజకీయ ప్రత్యర్థులపై విసురు విషపు అమ్ములు
దేశ ప్రగతి వెనుకకు తోసే చేతలు
ప్రజాతీర్పును పక్కదారి పట్టించే రీతులు
రాజకీయ కక్షతో రాజ్యాంగ ఉల్లంఘన
వ్యక్తిగత స్వార్థానికి వైషమ్యం ప్రేరేపణ
ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడిచే ఆచరణ
రాష్ర్టాల హక్కులపై నిస్సిగ్గుగ ఆక్రమణ
…? దండమూడి శ్రీచరణ్