వనపర్తి : వనపర్తి జిల్లాలో(Wanaparthi) ఓ కానిస్టేబుల్ రామకృష్ణ పీసీ నంబర్ (2234) మిస్సింగ్(Constable missing) కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పానగల్ పోలీస్ స్టేషన్(Panagal Police Station) పరిధిలో విధు లు నిర్వహిస్తున్న రామకృష్ణ గత రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. పానగల్ పీఎస్ నుంచి ఎస్కా ర్ట్ పీసీగా చివరిసారిగా విధులను నిర్వహించాడు.
ఆ తర్వాత రామకృష్ణ జాడ లేకుండా పోవడంతో.. అతని భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆర్థిక ఇబ్బందులతో విధులకు నిర్వర్తించ లేకపోతున్నానని తన భార్య మంజులకు మెసేజ్ చేసి రామకృష్ణ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..
Damini App | పిడుగులపై ‘దామిని’ ముందస్తు హెచ్చరికలు.. ఈ యాప్ గురించి మీకు తెలుసా..?
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎప్పుడు..? ఎందుకంటే..?
Trash balloons | కిమ్ వదిలిన చెత్త బెలూన్ల కారణంగా.. సియోల్లో మూతపడుతున్న ఎయిర్పోర్ట్లు