హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగా ణ): ఆర్టీసీ సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు జరుగుతున్నాయి. జేఏసీలో లేని కొన్ని కార్మిక సం ఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ర హస్యంగా చర్చలు జరుపుతున్నారని కార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు స మ్మె విజయవంతం కోసం జేఏసీ నేతలు అవిశ్రాంతంగా పోరాడుతుంటే.. కొందరు నేతలు మాత్రం రాత్రుళ్లు రహస్యంగా మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నిస్తున్నారు.
సదరు నాయకులు తమ సొంత ప్రయోజనా లు పకనబెట్టి, కార్మికుల డిమాండ్ల సాధన కోసం జేఏసీతో కలిసిరావాలని కోరుతున్నా రు. ఈ క్లిష్ట సమయంలో కార్మికుల సంక్షేమం కోసం మద్దతు తెలుపకపోతే.. భవిష్యత్తులో ఆయా సంఘాలను తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు. గతంలో 55రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె చేస్తే.. అప్పటి ఓ కీలక నేత మధ్యలోనే కాడి వదిలేశాడని, ఆ నేత ఇప్పుడు కూడా మంత్రితో చర్చలు జరుపడం విడ్డూరం గా ఉన్నదని మండిపడుతున్నారు. ఇకనైనా యూనియన్లకు అతీతంగా, కార్మిక లోకమం తా కలిసిరావాలని పిలుపునిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న ప్రభుత్వ వైఖరితోనే సమ్మెకు సిద్ధమవుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి చేపట్టే సమ్మెకు మద్దతుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిపో-1 ఎదుట కార్మికులతో కలిసి భోజన సమయంలో నిరసన తెలుపగా, ఉద్యోగులు సైతం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 22న సమ్మెలో పాల్గొంటామని కార్మికులు ప్రతినబూనారు.
ఈ సందర్భంగా థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కారణంగానే రాష్ట్ర జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిందని చెప్పారు. ఎన్నోసార్లు అధికారులు, ప్రభుత్వంతో చర్చలు జరిపినా దాటవేత ధోరణి తప్ప ఫలితం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లవుతున్నా స్పష్టమైన ప్రకటన చేయడంలేదని, పీఆర్సీ ఇస్తామని మాట తప్పిందని మండిపడ్డారు. ప్రైవేటీకరణ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులను తొలగించి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని వారు మండిపడ్డారు.
కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని అధికారులతో ఒత్తిడి తీసుకొస్తున్నదని తెలిపారు. గేట్ మీటింగ్‌లో ఉన్నతాధికారులు పాల్గొని సమ్మెకు పోవద్దని హెచ్చరికలు చేయడం సరికాదని హితవు పలికారు. మహాలక్ష్మి పథకంతో నెలకు రూ.350 కోట్లు ప్రభుత్వం బకాయి పెడుతున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీతో ఆర్టీసీ యాజమాన్యమే ఈవీ బస్సులను కొనుగోలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఎంపీ రెడ్డి, వైస్ చైర్మన్లు శంకర్‌రెడ్డి, కొమురయ్య, నాయకులు మహేశ్వర్, శ్రీకాంత్, గోపాల్, సుజాత, కార్మికులు పాల్గొన్నారు.