హుస్నాబాద్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నంలపై ఏకాభిప్రాయం కుదిరాకే ప్రభుత్వం ఫైనల్ చేయాలని సీపీ ఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సూచించారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియా తో మాట్లాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ అవినీతి రహిత పాలన అందించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఇప్పటికీ రోజూ అధికారులు ఏసీబీకి పట్టుబడటం దురదృష్టకరమని అన్నారు. రేవంత్ సర్కారుపై ప్ర జలకు ఎన్నో ఆశలు ఉన్నాయని చెప్పారు.